RTC Strike: అధికారులు ఇలాంటి నివేదికలివ్వడం ఆశ్చర్యం: హైకోర్టు

0
15

ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని హైకోర్టు సీ‌ఎస్‌ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, చీఫ్ జస్టీస్ ఎదుట నేరుగా హాజరై వివరణ ఇస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ, జీహెచ్ఎంసీ దాఖలు చేసిన అఫిడవిట్ల‌పై వాదననలు కొనసాగుతున్నాయి.

ఈ విచారణకు సీఎస్ జోషితో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు హాజరయ్యారు. రామకృష్ణారావు సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారులు హైకోర్టుకే ఇలా నివేదికలు ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఉద్దేశ పూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలుసా? అని హైకోర్టు రామకృష్ణారావుని ప్రశ్నించింది.

రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇస్తున్నట్టు రామకృష్ణారావు పేర్కొన్నారు. అంటే మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా? అని హైకోర్టు ప్రశ్నించింది. తక్కువ సమయంలో తమ కార్యాలయంలో ఉన్న రికార్డుల ఆధారంగా… నివేదిక రూపొందించామని… మన్నించాలని రామకృష్ణారావు కోరారు. అయితే క్షమాపణ కోరడం .. సమాధానం కాదని.. కోర్టులకు వాస్తవాలు చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.. మీరు చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయని… తాము వీటిని పరిగణనలోకి తీసుకోవాలా అని హైకోర్టు ప్రశ్నించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here