విధుల్లోకి చేరేందుకు ఆర్టీసీ కార్మికుల ఆసక్తి.. తిప్పి పంపుతున్న డిపో మేనేజర్లు

0
27

విధుల్లోకి చేరేందుకు ఆర్టీసీ కార్మికులు డిపోలకు తరలి వెళుతున్నారు. అయితే డిపోలోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది. ఆర్టీసీ జేఏసీ బేషరతుగా తమను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని చెప్పడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ నేపథ్యంలో విధుల్లోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

వరంగల్‌లో విధుల్లోకి చేరేందుకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలూ అందలేదని చెప్పి బయటకు పంపించారు. నిన్న కూడా ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు విధుల్లోకి చేరేందుకు వరంగల్ డిపో వద్దకు రాగా మేనేజర్ వారిని విధుల్లోకి తీసుకోలేదు. తమకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదని చెప్పడంతో నిరాశగా డ్రైవర్లు వెనుదిరగాల్సి వచ్చింది. డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here