‘రూలర్’ మూవీ రివ్యూ

0
127

చిత్రం: రూలర్‌
నటీనటులు: బాలకృష్ణ, సొనాల్‌ చౌహాన్‌, వేదిక, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, భూమిక తదితరులు
సంగీతం: చిరంతన్‌ భట్‌
సినిమాటోగ్రఫీ: రామ్‌ ప్రసాద్‌
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: సి.కల్యాణ్‌
కథ: పరుచూరి మురళి
దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌
సంస్థ: సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ: 20-12-2019

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ ఈరోజు డిసెంబర్ 20 న విడుదల అయింది. డైలాగులు చెప్పడంలోనూ యాక్షన్ సీన్స్ లోనూ ఆయనకీ ఆయనే సాటి. ఈ మూవీ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఇక మూవీ ఎలా ఉందో వివరాల్లోకి వెళ్తే..

కథ: సరోజని నాయుడు(జయసుధ)ఒక పెద్ద కంపెనీకి ఛైర్మన్‌. అనుకోని పరిస్థితుల్లో అర్జున్‌ ప్రసాద్‌(బాలకృష్ణ) గతం మర్చిపోయి ఆమెకు కనిపిస్తాడు. అర్జున్‌ను తన ఇంటికి తీసుకెళ్లి కొడుకులా చూసుకుంటుంది. కంపెనీ బాధ్యతలు కూడా అప్పగిస్తుంది. తన తెలివితేటలతో అర్జున్‌ కంపెనీని నెం.1 స్థానానికి తీసుకెళ్తాడు. ఒకసారి అర్జున్ కంపెనీకి ఉత్తర్‌ప్రదేశ్‌లో తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఒక ప్రాజెక్టు దక్కుతుంది.

అయితే అక్కడ ప్రాజెక్టు చేయొద్దని.. గతంలో అక్కడ ప్రాజెక్టు చేద్దామనుకున్న తనని మంత్రి భవానీనాథ్‌ ఠాగూర్‌(పరాగ్‌ త్యాగి) అడ్డుకుని అవమానించాడని చెబుతుంది సరోజని. దీంతో తన తల్లికి అవమానం జరిగిన చోటుకి వెళ్లి భవానీని అతని మనుషులను ఎదుర్కొనేందుకు వెళ్తాడు అర్జున్‌. అక్కడకు వెళ్ళాక అతన్ని చూసి అందరూ ధర్మ (బాలకృష్ణ) అని పిలుస్తారు? ఇంతకీ ధర్మ ఎవరు? అతనికీ అర్జున్‌ ప్రసాద్‌కీ సంబంధం ఏంటి? గతం ఎలా మర్చిపోయాడు? అసలేం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

వివరణ: హీరో గతం మర్చిపోవడం తనకేదో ఫ్లాష్ బ్యాక్ ఉండడం అనేది రొటీన్ కథ. పోనీ ఈ కథని ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ రవి కుమార్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మూవీ ఫస్ట్ హాఫ్ లో జయసుధ గతం మర్చిపోయిన బాలకృష్ణని చేరదీయడం కంపెనీ కి సీయివో చేయడం సోనాల్ చౌహన్ తో డ్యూయెట్స్ తో సాఫీగా సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ లో పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ యాక్షన్ సీన్స్ అలరిస్తాయి. సెకండ్ హాఫ్ లో వేదిక ఎంట్రీతో ఒక మలుపు వస్తుంది. తర్వాత భారీ క్లైమాక్స్ తో కథ ముగుస్తుంది.

నటీనటులు: స్టార్టింగ్ లో బాలయ్య సీయివోగా చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య చాలా మాస్ గా యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉన్నాయి. ఇక హీరోయిన్స్ లో ఫస్ట్ హాఫ్ ని సోనాల్ చౌహన్ సెకండ్ హాఫ్ ని వేదిక పంచుకున్నారు. కథ కథనం రొటీన్ గా అనిపిస్తుంది. కామెడీ కూడా అంతగా పండలేదు. పాటలు సంగీతం బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
బాలకృష్ణ
పాటలు
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:
కథ
కథనం
కామెడీ

రేటింగ్: ప్రేక్షకుని వ్యక్తిగత అభిప్రాయం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here