ఆర్ఎక్స్100’ భామ ఐటెం సాంగ్.. సోలో గ్లామర్ ట్రీట్

0
186

‘ఆర్ఎక్స్100’ సినిమాతో కుర్రకారును హుషారెత్తించిన పాయల్ రాజ్‌పుత్.. ఈ సారి ఐటెం సాంగ్‌తో ఉర్రూతలూగించడానికి రెడీ అవుతోంది. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న ‘సీత’ చిత్రంలో పాయల రాజ్‌పుత్ స్పెషల్ ఐటెం సాంగ్ చేసింది. ‘బుల్ రెడ్డి..’ అంటూ సాగిపోయే ఈ సాంగ్ థియేటర్స్‌ని హోరెత్తిస్తుందని అంటోంది చిత్రయూనిట్.

తన కెరీర్‌లో మొదటిసారి ఐటెం సాంగ్ చేస్తున్న పాయల్.. ఈ సాంగ్‌తో సోలో గ్లామర్ ట్రీట్ ఇచ్చి అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని యూనిట్ చెబుతోంది. ఈ సాంగ్‌ని రేపు (బుధవారం) ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘సీత’ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here