మూవీకి సంబంధించిన పోస్టర్లపై ఆ సినిమాలోని యాక్టర్లపైనా ట్రోల్ల్స్ రావడం సహజమే. అయితే తాజాగా సాయిధరమ్ తేజ్ తనపై వచ్చిన ట్రోల్స్ గురించి స్పందించారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున ‘ప్రతి రోజు పండగే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇటీవల జరిగిన రాశి ఖన్నా పుట్టినరోజు సందర్బంగా రాశి ఖన్నా, సాయి ధరమ్ తేజ్ ల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ ఫొటోల్లో వారు క్లోజ్ గా కనిపించడంతో ఆ ఫొటోలు చూసిన కొందరు నెటిజన్లు వారి అభిమాన నటి మీద చేయి తీయమని.. ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీంతో సాయి ధరమ్ తేజ్ ట్రోల్ల్స్ పై స్పందిస్తూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘మీ నుంచి వస్తున్న ఈ స్పందనలు నన్ను ఆలోచించేలా చేస్తున్నాయి. సినిమాలో భాగంగా అని తెలిసి కూడా.. మీ ఫేవరెట్ హీరోయిన్ పై చేయి వేస్తే చెయ్యి తీయ్ అని అన్నారు. ఇంతే ప్రేమ జాలితో మన చుట్టూ ఉండే అమ్మాయిలను చూడగలిగితే మహిళా డాక్టర్ లాంటి బాధితులు మన సమాజంలో ఉండరు కదా?’ అని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు.