‘సరిలేరు నీకెవ్వరు’ 3 రోజుల బాక్స్ ఆఫీస్ వసూళ్లు.. బ్లాక్ బస్టర్ కా బాప్

0
126

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11 న విడుదలైన మొదటిరోజే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.103 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ని విడుదల చేసింది.

వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 63.09 కోట్ల షేర్ ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.48.34 కోట్ల షేర్‌ రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే..

‘సరిలేరు నీకెవ్వరు’ 3వ రోజు బాక్స్ ఆఫీస్ వసూళ్లు.. 

నిజాం: 15.50 కోట్లు
సీడెడ్: 6.16 కోట్లు
ఉత్తరాంధ్ర: 6.50 కోట్లు
గుంటూరు: 6.11 కోట్లు
ఈస్ట్ గోదావరి: 4.54 కోట్లు
వెస్ట్ గోదావరి: 3.52 కోట్లు
కృష్ణా: 4.23 కోట్లు
నెల్లూరు: 1.78 కోట్లు
AP&TS: 48.34 కోట్లు

ROI: 6.15 కోట్లు
ఓవర్సీస్ : 8.60 కోట్లు
వరల్డ్ వైడ్: 63.09 కోట్లు

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, సంగీత కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఘట్టమనేని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here