”సరిలేరు నీకెవ్వరూ” లో మహేష్ కొత్త లుక్…

0
156

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటి విజయశాంతి చాలా కాలం తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో మహేష్ గొడ్డలి పట్టుకుని యాక్షన్ లోకి దిగబోతున్నట్లుగా కనిపిస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో క‌ర్నూలు కొండారెడ్డి బురుజు కొంత మంది గ్యాంగ్ ఉన్నారు. ఒక్క‌డు రేంజ్ స్టైల్లో సినిమా క‌నిపిస్తోంది.

ఇప్పటిదాకా ఈ సినిమాలో కామెడీ బాగుంటుందని అనుకుంటుండగా ఈ పోస్టర్ తో ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని అర్ధమవుతోంది. ఇక ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తవుతుందని సమాచారం. అన్ని విధాలా ఎంటర్ టైన్ చేయడానికి ఈ సినిమా సంక్రాంతికి మన ముందుకు రాబోతోంది.

ఈ చిత్రానికి ఘట్టమనేని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here