సీనియర్ నటి గీతాంజలి ఇకలేరు

1
211

సీనియర్‌ నటి గీతాంజలి(72) కన్నుమూశారు. గుండెపోటుతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. గీతాంజలి అసలు పేరు మణి. 1947లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గీతాంజలి జన్మించారు. ఆమె తన సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గీతాంజలి నటించారు.

గీతాంజలి తనయుడు శ్రీనివాస్‌ కూడా సినీ నటుడే కావడం విశేషం. 1961లో తొలిసారిగా ‘సీతారామ కల్యాణం’ చిత్రం ద్వారా గీతాంజలి వెండితెరకు పరిచయమయ్యారు. సీతారామ కల్యాణం, బొబ్బిలి యుద్ధం, ఇల్లాలు, దేవత, లేతమనసులు, తోడు-నీడ, గూఢచారి-116, ప్రాణమిత్రులు, పూలరంగడు, శ్రీకృష్ణావతారం, ఆదర్శకుటుంబం, రణభేరి, నిండు హృదయాలు, మంచిమిత్రులు, డాక్టర్‌ చక్రవర్తి, పెళ్లైన కొత్తలో, ఫూల్స్‌ తదితర చిత్రాల్లో గీతాంజలి నటించారు. ఆమె చివరి సినిమా తమన్నా కథానాయికగా రూపొందుతున్న ‘దటీజ్ మహాలక్ష్మీ’. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉండగానే గీతాంజలి పరమపదించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here