తుది శ్వాస విడిచిన సీనియర్ మోస్ట్ న్యాయవాది “రామ్ జఠ్మలానీ”

0
86

దేశంలోనే సీనియర్ మోస్ట్ మరియు అత్యంత ఖరీదైన న్యాయవాదిగా పేరు పొందిన రామ్ జఠ్మలానీ ఈరోజు ఉదయం ఢిల్లీ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని అయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 1923 సెప్టెంబర్ 14న సింధ్ ప్రావిన్స్ లోని సిఖార్పూర్ లో రామ్ జఠ్మలానీ గారు జన్మించారు. ఆయన వయస్సు 96 సంవత్సరాలు. ఆయన పూర్తి పేరు రామ్ బూల్ చంద్ జఠ్మలానీ.

ఆయనొక పేరు పొందిన న్యాయవదియే కాకుండా రాజకీయనేత కూడా. ఆయన భారతదేశానికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి గాను మరియు బార్ కౌన్సిల్ చైర్మన్ గాను వ్యవహరించారు. కేంద్రంలో బీజేపీ హయాంలో మంత్రిగా పనిచేసి, రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. సుప్రీమ్ కోర్ట్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న న్యాయవాది రామ్ జఠ్మలానీ గారు. ఆయన ఎన్నో వివాదాస్పదమైన కేసులను వాదించారు. ఆయన ఎక్కువగా ఖరీదైన కేసులను స్వీకరించడం వలన పేదలకు చేరువ కాలేకపోయారు.

దాదాపు 70 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన రామ్ జఠ్మలానీ అసలు ఓటమి ఎరుగరు. వారు ఏదైనా కేసును స్వీకరించారంటే అవతల పక్షం వారికి లాయర్ కూడా దొరకరు అంటే రామ్ జఠ్మలానీ గారు ఎటువంటి పేరుపొందిన లాయరో వేరే చెప్పనక్కర్లేదు. ఏపీ ముఖ్యమంత్రి వై.స్.జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులను కూడా వీరే వాదించారు. దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన కేసులకు ఈయననే లాయర్ గా నియమించుకునేవారు.

ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా వారి సలహా తీసుకుంటే అది సులువుగా పరిష్కరింపబడుతుందనే ధీమా కేంద్ర ప్రభుత్వానికి ఉండేది. దేశానికి న్యాయపరంగా విశేష సేవలు అందించిన రామ్ జఠ్మలానీ గారి మరణం తీరని లోటు అని ప్రముఖ న్యాయవాదులు మరియు రాజకీయనేతలు నివాళి అర్పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here