ప్రేమికుల రోజున గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడుతున్న నితిన్.!

0
133

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. హీరో నితిన్ ‘బాయ్ ఫ్రెండ్ లా మార్చద ఏ పిల్లా’ అంటూ బాధపడుతున్నాడు. యంగ్ హీరో, నితిన్ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుములు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’.. సింగిల్ ఫరెవర్- ట్యాగ్ లైన్.

ఈరోజు ప్రేమికుల రోజు సందర్బంగా టైటిల్ కి తగ్గ సాంగ్ ‘సింగిల్స్ ఆంథమ్’ ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు చిత్రబృందం. ఈ సాంగ్ లో నితిన్ ‘సింగిలే ఐ యామ్ రెడీ టు మింగిలే.. లైఫ్ కి లేవే రంగులే.. నను బాయ్ ఫ్రెండ్ లా మార్చద ఏ పిల్లా’ అంటూ బాధపడుతుంటాడు. మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి పాడారు.

మరి రష్మిక తన లైఫ్ లోకి ఎలా ప్రవేశించింది.? ఇద్దరు కలిసారా? మరి టైటిల్ లో సింగిల్ ఫరెవర్ ఉన్నట్లు చివరికి కలవలేదా? తెలుసుకోవడానికి మనం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 21 న శివరాత్రి కానుకగా విడుదల చేయనున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here