తెలంగాణ రాజ్ భవన్ లో ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం…

0
559

ఈరోజు సాయంత్రం 4గంటలకు తెలంగాణ రాజ్ భవన్ లో ఆరుగురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. తెలంగాణ కొత్త గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ గారు కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ సీఎం కే.సి.ఆర్ గారు నిర్దేశించిన ఆరుగురు కొత్త మంత్రుల శాఖలు ఈ విధంగా ఉన్నాయి.

1. హరీష్ రావు: ఆర్ధిక శాఖ
2. కే.టి.ఆర్: పురపాలక, ఐటి, మైనింగ్, పరిశ్రమల శాఖలు
3. సబితా ఇంద్రా రెడ్డి: విద్యా శాఖ
4. గంగుల కమలాకర్: పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖలు
5. సత్యవతి రాథోడ్: గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖలు
6. పువ్వాడ అజయ్ కుమార్: రవాణా శాఖ

ఈ మంత్రి వర్గ విస్తరణ పూర్తయ్యాక రాత్రి 7గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో కాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ లో 2019-20 కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదల్ని మంత్రి వర్గం ఆమోదించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here