సోలో బ్రతుకే సో బెటర్ ’ నుంచి మూవీ థీమ్ సాంగ్ విడుదల..

0
85

సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ యెన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. రేపు వాలంటైన్స్ డే సందర్బంగా హీరో ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ థీమ్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘సింగల్ సోదరసోదరీమణులారా..’ అంటూ ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ థీమ్ సాంగ్ వీడియో లింక్ ను పోస్ట్ చేశారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది.

‘కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ.. ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్.. అలాగే, ‘ప్రేమ’ అనేది కూడా ఒక ఫీలింగేగా, మారదని గ్యారంటీ ఏంటి?.. మన గోల్ ఏంటి?.. మన అజెండా ఏంటి?.. ‘సోలో బ్రతుకే సో బెటర్ ?’ అంటూ సాయి ధరమ్ తేజ్ అనడం కనబడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here