‘రాగల 24 గంటల్లో’ నుండి చిల్డ్రన్స్ డే సందర్బంగా స్పెషల్ వీడియో..

0
115

సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం `రాగల 24 గంటల్లో’. ఇటీవలే సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 15 న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన కొన్ని రోజులు వాయిదా వేశారు.

ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్బంగా ఒక వీడియోను విడుదల చేసారు. ఇందులో ఈషా రెబ్బా చిన్న పిల్లలతో గడిపిన మధురమైన క్షణాలను చూపించారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని నవంబర్ 22 న విడుదల చేయనున్నట్లు ఈ వీడియో ద్వారా ప్రకటించారు.

సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ నవహాస్ క్రియేషన్స్ శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్‌పై `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు నిర్మించారు. రఘు కుంచె ఈ చిత్రానికి బాణీలు అందించారు. ఈ చిత్రం నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here