స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఇల్లు ”బ్లెస్సింగ్”…

0
134

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొన్ని నెలల క్రితం కొత్త వ్యానిటీ వ్యాన్ ను రూ. 3.5 కోట్లతో కొనుగోలు చేసి, మరో రూ. 3.5 కోట్లు ఖర్చుపెట్టి ముంబై కి చెందిన ఓ ఆటోమోటివ్ డిజైనర్ తో తనకు అవసరమైనట్టుగా మార్పులు  చేయించుకున్నారన్నది తెలిసిన విషయమే.

ఇప్పుడు కొత్తగా స్టైలిష్ స్టార్ కొత్త ఇంటిని నిర్మించుకోబోతున్నారు. ఆ ఇంటికి ”బ్లెస్సింగ్” అని పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. దీనితో పాటుగా ఆయన తన భార్య స్నేహ, కుమారుడు అయాన్, కుమార్తె అర్హా తో కలిసి భూమి పూజ చేస్తున్న ఫోటోను కూడా షేర్ చేసారు.

View this post on Instagram

BLESSING

A post shared by Allu Arjun (@alluarjunonline) on

ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ”అల… వైకుంఠపురములో…” చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. పూజ హెగ్దే, అల్లు అర్జున్ సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో జరుగుతోంది. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here