ఫిలిం ఛాంబర్‌ లోకి మనల్ని రానిస్తారా లేదా? అనుకున్నాను – సుడిగాలి సుధీర్

0
51

‘జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డాక్టర్‌ ఎన్‌. శివ ప్రసాద్‌ నటించిన చివరి చిత్రం కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ 10 మిలియన్‌ వ్యూస్‌కి పైగా సాధించి ట్రెండింగ్‌లో నిలిచిందంటే ఈ చిత్రం పట్ల ఆడియన్స్‌లో ఎంతటి అటెన్షన్‌ ఉందో అర్థమవుతోంది.

డిసెంబర్‌ మొదటి వారంలో సినిమా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో…

హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ – ”నేను పదేళ్ల క్రిందట హైదరాబాద్‌ వచ్చి ఫిలిం ఛాంబర్‌ ముందుగా వెళ్తూ.. మనల్ని లోపలికి రానిస్తారా లేదా? అనుకున్నాను. అలాంటిది ఇవ్వాళ నా ఫస్ట్‌ సినిమా ప్రెస్‌మీట్‌ ఇక్కడ జరగడానికి ఆ దేవుడి ఆశీస్సులు, మా అమ్మానాన్నల ఆశీర్వాదమే కారణం అనుకుంటున్నాను. మార్చిలో రాజశేఖర్‌గారు నాదగ్గరికి వచ్చి స్టోరీ లైన్‌ చెప్పారు. చాలా బాగుంది సర్‌. టెక్నీషియన్స్‌ ఎవరు? అని అడిగాను. వెంటనే రామ్‌ ప్రసాద్‌గారు కెమెరా, గౌతం రాజు ఎడిటర్‌, రామ్‌ లక్ష్మణ్‌ ఫైట్స్‌, భీమ్స్‌ మ్యూజిక్‌, అని చెప్పారు. అంత పెద్ద టెక్నీషియన్స్‌ నా సినిమాకు ఎందుకు వర్క్‌ చేస్తారు అనుకున్నాను. కానీ సెకండ్‌ మీటింగ్‌లో ప్రొడ్యూసర్‌గారితో వచ్చి అడ్వాన్స్‌ ఇచ్చి మార్చి 20 షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది అని చెప్పారు. మార్చి 20 నా లక్కీ డే. ఆరోజు నా రెండు సినిమాలు షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. మొదటి రోజు షూటింగ్‌ కి వెళ్ళగానే అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్‌ వేసి ప్రొడ్యూసర్‌గారు అక్కడే కూర్చొని అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు.

నా లైఫ్‌లో నేను ఇంకో సినిమా ఇంత పెద్ద టెక్నిషియన్స్‌తో చేస్తానో! లేదో తెలీదు. మొదటి సినిమాకే ఇంత పెద్ద టెక్నిషియన్స్‌ని ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్‌. మా నాన్న, బి.ఎ. రాజుగారు సన్నిహితులు. ఆయన నా సినిమాకి వర్క్‌ చేయడం చాలా హ్యాపీ. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ధన్య బాలకృష్ణగారితో షూటింగ్‌ ఫన్నీగా జరిగింది. ఇప్పటివరకూ నన్ను ఎలా సపోర్ట్‌ చేశారో, వెండి తెరపై కూడా అలాగే సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నాను. కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉండడం ఈ సినిమా ప్రత్యేకత.

అలాగే ఈ సినిమాలో డాన్సులు, ఫైట్స్‌ చేశాం. ఎలా ఉన్నాయో మీరే స్క్రీన్‌ మీద చూసి చెప్పాలి. అలాగే నా పేరు మీదే టైటిల్‌ ఉండడం కూడా హ్యాపీ. నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు రజినీకాంత్‌గారు, పవన్‌ కల్యాణ్‌గారు. ఈ సినిమాలో వారిద్దర్నీ ఇమిటేట్‌ చేయడం జరిగింది. డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌ రిలీజ్‌ అనుకుంటున్నాం. మీ మీడియా సపోర్ట్‌ మాకు ఎప్పటిలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటిస్తున్నారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, డా. ఎన్‌. శివప్రసాద్‌, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here