సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం బరిలోకి దిగిన మహేష్ బాబు…

0
143

ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. వీరి కాంబినేషన్ లో రాబోతున్న మొదటి చిత్రమిది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఈరోజు (నవంబర్ 7) సాయంత్రం 5:30pm కి దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.

భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ, మళయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ చేయడానికి చిత్రబృందం ఈ మూవీ మోషన్ పోస్టర్స్ ని తమిళ్ లో కమలహాసన్, హిందీలో సల్మాన్ ఖాన్, మళయాళంలో మోహన్ లాల్, అలాగే తెలుగులో మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయనున్నారని చిత్రబృందం ప్రకటించింది.

ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. బన్నీ ‘అల.. వైకుంఠపురములో..’, మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’, కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here