మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

0
114

మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను చేపట్టింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. మద్దతు లేఖ, గవర్నర్‌ ఆహ్వాన లేఖను.. సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు సమర్పించారు. బీజేపీ తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. మూడు పార్టీల తరపున కపిల్ సిబల్‌ వాదనలు వినిపిస్తున్నారు. అజిత్‌పవార్‌ తరపున మణిందర్ సింగ్ వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here