మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

0
124

మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అసెంబ్లీలో రేపు బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రంలోగా ఫడ్నవీస్ ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాలని నిర్దేశించింది. బలనిరూపణకు ముందే ఎమ్మెల్యేలు ప్రమాణం చేయాలని స్పష్టం చేసింది. రహస్య ఓటింగ్‌ జరపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రొటెం స్పీకర్‌ అజమాయిషీలోనే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బలపరీక్ష ఒక్కటే అజెండాగా సభ నిర్వహించాలని స్పష్టం చేసింది. బలపరీక్షను మొత్తం వీడియో తీయడంతో పాటు ప్రత్యక్ష ప్రసారం చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here