మహారాష్ట్ర సంక్షోభంపై తీర్పు వాయిదా

0
77

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నిర్ణయాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మసనం ఇవాళ విచారణ చేపట్టింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు 24 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలంటూ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పక్కనబెట్టేసింది. తమకు 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనీ.. 24 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలంటూ ఎన్సీపీ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అభ్యర్థించారు. కానీ ఇప్పటికిప్పుడు బలపరీక్ష నిర్వహించాల్సిన అవసరమేంటంటూ బీజేపీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో బలపరీక్ష జరపాలన్న అంశాన్ని సైతం ఆయన వ్యతిరేకించారు. ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం తీర్పును రేపు ఉదయం 10:30కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here