తహసీల్దార్‌ను హత్య చేసిన నిందితుడు సురేష్ మృతి

0
156

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసు నిందితుడు సురేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత సోమవారం తహసీల్దార్‌పై సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన విషయం తెలిసిందే. వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వాలని తహసీల్దార్‌ను పలుమార్లు కోరినప్పటికీ ఆమె కనికరించలేదన్న కారణంతో హత్య చేశానని పోలీసుల వాంగ్మూలంలో సురేష్ చెప్పిన విషయం తెలిసిందే.

విజయారెడ్డి కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని… దీంతో తాను ఆమెపై కక్ష పెంచుకున్నట్టు సురేష్ తెలిపాడు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆమెను హత్య చేసినట్టు గతంలో వెల్లడించాడు. అయితే హత్యోదంతంలో సురేష్ కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. 65 శాతం కాలిన గాయాలతో సురేష్ ఆసుపత్రిలో చేరాడని అతని పరిస్థితి విషమమని రెండు రోజుల క్రితం డాక్టర్లు వెల్లడించారు. 74 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు. ఈ నేపథ్యంలో సురేష్ మృతి చెందడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here