“కొంచెం టచ్ లో ఉంటే చెప్తా-సీజన్ 4″….. “సూర్య”, “సయేషా సైగల్”…

0
810

జీ-తెలుగు ఛానల్ లో సక్సెస్ గా రన్ అవుతున్న షో “కొంచెం టచ్ లో ఉంటే చెప్తా-సీజన్ 4”. యాంకర్ ప్రదీప్ ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ లేటెస్ట్ సీజన్లో తెలుగు సినిమా తారల సరదా సీక్రెట్స్, వాళ్లు నటించిన సినిమా సెట్స్ లో జరిగే ‘బిహైండ్ ది సీన్స్’ సంగతులు, వారు చేయబోయే కొత్త సినిమాలకు సంబంధించిన తాజా విషయాలు మరియు వారి అలవాట్లు, ఫేవరేట్స్ ఇలా అన్నీ అభిమానుల ముందుకు తీసుకువస్తోంది. ఈ షో లో ప్రదీప్ చేసే కామెడీ కూడా బాగా ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈరోజు సెప్టెంబర్28 రాత్రి 9pm కి, ఈ పాపులర్ చాట్ & గేమ్ షోకి ప్రముఖ తమిళ నటుడు “సూర్య” మరియు సయేషా సైగల్ రాబోతున్నారు. ఇంకా సూర్య చిరంజీవి ‘ముఠా మేస్త్రి” సాంగ్ కి స్టెప్స్ వేశారు. ఈ ఎపిసోడ్ లో వారి సీక్రెట్స్, సినిమాలతో పాటు ప్రదీప్ వీరితో చేసే అల్లరి ఎంతగానో అలరించనుంది. ఈ ఎపిసోడ్ ప్రోమో కూడా విడుదల చేసారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here