”సైరా” నరసింహ రెడ్డి మూవీ 4 రోజుల కలెక్షన్స్ ….

0
74

మెగాస్టార్ చిరంజీవి 12 ఏళ్ల డ్రీం ప్రాజెక్ట్ ”సైరా” నరసింహ రెడ్డి అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చి 3 రోజుల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీ గా సంచలనం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ వీకెండ్ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఇక ఈ 4 రోజుల కలెక్షన్స్ వివరాలు చూస్తే నిజాంలో ఈ మూవీ చక్కటి వసూళ్లను రాబడుతోంది. నిజాంలో 4 వ రోజు రూ. 2.56 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయగా, 4 రోజుల్లో మొత్తం రూ. 17.18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇక ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ రావడంతో USA లో 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని కూడా దాటేసింది. ఇక ఈ వీకెండ్ లో టికెట్ రేట్స్ తగ్గించడంతో అక్కడ కలెక్షన్స్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటె చెన్నై సిటీలో మాత్రం ”సైరా” కంటే ”జోకర్”, ”వార్” మూవీస్ ఎక్కువ కలెక్షన్స్ ను రాబడుతోంది. చెన్నై లో 4 వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే

జోకర్ – 20 లక్షలు
వార్ – 18 లక్షలు
సైరా – 12 లక్షలు

4 రోజుల టోటల్ గ్రాస్ వివరాలు ఇలా ఉన్నాయి.
జోకర్ – 81 లక్షలు
వార్ – 81 లక్షలు
సైరా – 66 లక్షలు

స్వాతంత్ర్య సమర యోధుని అసలు కథ ఆధారంగా తీసిన సినిమా ”సైరా” నరసింహ రెడ్డి. దాదాపు రూ. 280 కోట్ల భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here