”సైరా” నరసింహ రెడ్డి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్…

1
346

భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 న విడుదలైన ”సైరా” నరసింహా రెడ్డి మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఒక స్వాతంత్ర్య పోరాట యోధుని పాత్ర పోషించాలనే చిరంజీవి కోరిక ఈ చిత్రంతో తీరిపోయింది. నిర్మాతగా రామ్ చరణ్ తన తండ్రి కోరికను తీర్చాడు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 280 కోట్ల భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించారు.

ఈ చిత్రానికి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో చక్కటి కలెక్షన్స్ రాబడుతోంది. ”సైరా” మూవీ తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్ దాటిందని ఫిలిం ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ లో ఫస్ట్ డే రూ. 10 కోట్ల షేర్ రాబట్టిందని సమాచారం. అమెరికా లో ప్రీమియర్ షో లలో దాదాపు రూ. 6.16 కోట్లు రాబట్టిందని సమాచారం. ఆస్ట్రేలియా లో కూడా ఈ చిత్రం చక్కటి వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా రూ. 190 కోట్ల భారీ బిజినెస్ చేసిన ”సైరా” ప్రాఫిట్ జోన్ లోకి రావడానికి రెండు మూడు రోజులకంటే ఎక్కువ టైం పట్టదని ట్రేడ్ వర్గాల అంచనా.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here