Sye Raa Narasimha Reddy మూవీ పబ్లిక్ టాక్….

2
213

అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘సైరా’ నరసింహా రెడ్డి మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు విడుదల అయింది. రేనాటి సూర్యుడు తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరంజీవి జీవించేసారు. అసలు నరసింహ రెడ్డి అంటే ఇలానే ఉంటాడేమో అనేలా చేసారు.

ఈ చిత్రంలో అనుష్క ఝాన్సీ లక్ష్మి బాయ్ పాత్రలో తన సైనికులలో ఉతేజాన్ని , ఆవేశాన్ని నింపడం కోసం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పోరాటం గురించి చెప్పడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత నరసింహా రెడ్డి ఎంట్రీ అద్భుతంగా ఉంటుంది. ఆయన తాత గారికి వారసులు లేకపోవడంతో నరసింహా రెడ్డి ని వారసునిగా చేసుకుని రాజ్యాన్ని పాలిస్తాడు.

తర్వాత బ్రిటిష్ వాళ్లు ప్రజలపై చేసే అక్రమాలకు ఎదురు తిరిగి ఉద్యమం చేస్తాడు. మొదట కొంతమంది ప్రజలు మాత్రమే సపోర్ట్ చేయడంతో వారితో కలిసి యుద్ధం చేసి 300 బ్రిటిష్ సైన్యాన్ని మట్టుబెట్టటంతో మిగిలిన పాలెగాళ్ళు కూడా నరసింహరెడ్డితో కలిసి పోరాడతారు. తమిళనాడు నుండి కూడా పోరాటం చేయడానికి రావడంతో వారికి ఎలా తెలిసిందని అడుగగా అక్కడ ఆయన గురించి లక్ష్మి తన కళ ద్వారా అందరినీ చైతన్య పరుస్తుందని తెలుస్తుంది.

ఈ విషయం తెలిసి బ్రిటిష్ వాళ్లు ఆమెని బంధిస్తారు. ఆమె సూసైడ్ బాంబుగా మారి అక్కడున్న 300 మంది సైనికులను మొత్తం బాంబులను పేల్చేలా చేస్తుంది. లక్ష్మి గా తమన్నా చాలా బాగా చేసింది. అతని భార్యగా నయనతార కూడా చాలా బాగా చేసింది. అందరు ఎవరి పాత్రలో వారు చాలా బాగా చేసారు.

కానీ చివరికి వారి సైన్యంలోనే వీరా రెడ్డిని బ్రిటిష్ వాళ్లు మానిప్యులేట్ చేసి నరసింహా రెడ్డిని పట్టుకుంటారు. తర్వాత వీరా రెడ్డి కూడా తన తప్పు తెలుసుకుని తనకు తానే పొడుచుకుని చనిపోతాడు.

నరసింహా రెడ్డి ని ఉరి తీసేముందు కూడా తనకున్న జలస్థంబన విద్య ద్వారా బయటపడి బ్రిటిష్ సైనికులపై తిరగబడటంతో వెనకనుండి తల నరికి కోట గుమ్మానికి వేలాడదీస్తారు.

ఈ సినిమా చూస్తున్నంతసేపు దేశం కోసం వారు చేసిన పోరాటం వారి దేశ భక్తి చూసి అప్పట్లో వారు మన కోసం  ఇంతలా పోరాడారా అనిపించింది. అంతలా సినిమాలో లీనమైపోయేలా చేసారు, అంత అద్భుతంగా తీశారు మూవీ.

ఈ సినిమాతో చిరంజీవి కల తీరడమే కాకుండా రామ్ చరణ్ మంచి ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే మరియు అమిత్ త్రివేది అందించిన మ్యూజిక్ కూడా తోడవడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. తన తండ్రికి మర్చిపోలేని తీపి జ్ఞాపకాన్ని ఇచ్చాడని రామ్ చరణ్ ని అందరూ పొగుడుతున్నారు.

2 COMMENTS

  1. ఖచ్చితంగా మీరు ఈ చిత్రం ను చూసినారు . ఒక వేళ నిద్రపోయి ఉంటే ఇలా రాసి ఉండరు . తలచు కుంటే మీరు కూడా రొట్టె కోలతో మీ శ్రీవారి పై యుద్ధం చేయ వచ్చున్ !!. అబ్బా !! 👌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here