”సైరా” మూవీ రెండవ రోజు వసూళ్లు…

2
366

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ”సైరా” నరసింహ రెడ్డి మూవీ అక్టోబర్ 2 న విడుదలయింది. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మొదటి రోజునే రూ. 85 కోట్ల గ్రాస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.

ఇక ఈ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 32 కోట్లు రాబట్టడం విశేషం. కర్ణాటకలో మొదటిరోజు 8 కోట్లు రాబట్టిన ‘సైరా’ రెండవ రోజు 5 కోట్లు మరియు ఓవర్సీస్ లో 2.5 కోట్ల షేర్ రాబట్టిందని సమాచారం.

మొదటి రోజు రూ. 60 కోట్ల షేర్ వసూలు చేయగా రెండవ రోజు 45 కోట్లు వసూలు రాబట్టిందని సమాచారం. ఈ వీకెండ్ లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here