బీజేపీలో చేరిన టీడీపీ బహిష్కృత నేత

2
260

ఢిల్లీ: టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లి టీడీపీలో ఫైర్‌బాండ్‌గా ఓ వెలుగు వెలిగారు. టీడీపీకి అత్యంత విధేయుడిగా ఉన్న ఆయన.. సడెన్‌గా ఏమైందో ఏమో కానీ చంద్రబాబును టార్గెట్ చేసుకుని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

అక్కడితో ఆగకుండా చంద్రబాబు టీడీపీ ద్రోహి అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపణలు గుప్పించిన మోత్కుపల్లి… గత ఎన్నికల సమయంలో చంద్రబాబు గెలవకూడదని తిరుమల పాదయాత్ర కూడా చేశారు.

అయితే ఏపీలో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడు కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లిని బీజేపీలోకి చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here