తహసీల్దార్ హత్య: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరస్పర ఆరోపణలతో హీటెక్కిన రాజకీయం

0
151

హైదరాబాద్‌: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు హత్య ‘నీపనేనంటే.. నీపనే’ అంటూ ఆరోపణలు గుప్పించుకోవడం సంచలనానికి దారి తీసింది. ఈ సజీవ దహనం ఘటనపై మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడంతో రాజుకున్న రాజకీయ దుమారం రోజురోజుకూ పెరుగుతోంది.

నిందితుడు సురేశ్‌ భూములు కొన్నది మల్‌రెడ్డి రంగారెడ్డేనని.. హత్యలో విపక్షం పాత్ర ఉందని ఎమ్మెల్యే మంచిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ఇదంతా ఎమ్మెల్యే మంచిరెడ్డి పనేనని మల్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయారెడ్డి కుటుంబ సభ్యులు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తున్నారు. కుట్ర వెనుకాల పాత్రలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here