తహసీల్దార్ హత్య: కారులోని వ్యక్తులను గుర్తించిన పోలీసులు? కీలక సమాచారం వెలుగులోకి..

0
92

తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రత్యక్ష సాక్షులతో పాటు సీసీ టీవీ ఫుటేజ్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది.

తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం నిందితుడు సురేష్ బయటకు వచ్చి వైన్‌ షాపు సమీపంలో కారులోని కొందరు వ్యక్తులతో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా కారులో ఉన్న వ్యక్తులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

వారిని పట్టుకుని విచారిస్తే కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా ఆ కారు ఎటు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మేజిస్ట్రేట్ వద్దనున్న సురేష్ వాంగ్మూలం కూడా పోలీసులకు అందనుంది. ప్రస్తుతం ఈ కేసులో ఇదే కీలకం కానుంది. సురేష్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here