తెలంగాణ కేబినెట్ రెడీ.. ఆర్ధిక శాఖ సంగతేంటో!

Telangana cm kcr inducted 10 MLAs as ministers into his cabinet

0
241

తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు క్యాబినెట్ కూర్పు జరిగింది. 10 మంది మంత్రులకు కేసీఆర్ తన కేబినెట్ లో చోటిచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్ అధికారికంగా మంత్రుల వివరాలు ప్రకటించారు.

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి- వ్యవసాయశాఖ
ఎర్రబెల్లి దయాకర్ రావు- పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధి
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి- అటవీ, దేవాదాయశాఖ, న్యాయ శాఖ
ఈటల రాజేందర్- వైద్య, ఆరోగ్య శాఖ
కొప్పుల ఈశ్వర్- సంక్షేమశాఖ
వేముల ప్రశాంత్ రెడ్డి- రోడ్లు భవనాలు-రవాణాశాఖ
గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి- విద్యా శాఖ
సిహెచ్. మల్లారెడ్డి- కార్మిక శాఖ, ఉపాధి, మానవ వనరుల శాఖ
శ్రీనివాస్ గౌడ్- ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం
తలసాని శ్రీనివాస్ యాదవ్- పశు సంవర్ధక శాఖ

అయితే ఆర్ధిక శాఖకు మంత్రిని కేటాయించక పోవటంతో కేబినెట్ విస్తరణ అంశం ఆసక్తికరంగా మారింది. మున్ముందు ఈ శాఖపై నిర్ణయం తీసుకొని.. బడ్జెట్ తరువాత ఆర్ధిక శాఖకు మంత్రిని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు కేబినెట్ లో చోటు దక్కకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here