భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం.. సీఎం కేసీఆర్ రాక!

0
124

*మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీస్*

ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పిలువబడే.. ప్రతి రెండేళ్ళకొకసారి జరిగే మేడారం జాతరకు తమ మొక్కులను తీర్చుకోవడం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. మేడారంజాతరకు తెలంగాణా టూరిజం తరపున హెలికాప్టర్ సర్వీస్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మేడారం జాతరను, ఆదివాసీ, గిరిజనులను పట్టించుకోలేదని విమర్శించారు.

హైదరాబాద్‌ నుంచి మేడారం హెలికాప్టర్‌ టికెట్ ధర రూ.30వేలు (అప్ అండ్ డౌన్, వీఐపీ దర్శనం), ఆరుగురు కెపాసిటీ ఉన్న ఆ హెలికాప్టర్ లో ఆరుగురు గ్రూప్ గా వస్తే 1.2 లక్ష టికెట్ ధర. అలాగే మేడారంలో ఏరియల్‌ వ్యూ టికెట్ ధర రూ.2,999. ఈ అవకాశాన్ని భక్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. తెలంగాణలోని ప్రాంతాలను ప్రపంచానికి చూపిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

*భారీగా తరలివస్తున్న భక్తులు* 

ఫిబ్రవరి 5న మొదలయ్యే మేడారం జాతర ఫిబ్రవరి 7న ముగుస్తుంది. ఈ జాతరను చూడటానికి ఈరోజు నుండే భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఈరోజు 50000 మంది భక్తులు రాగా.. అందులో కొంత మంది వెళ్లిపోగా మరికొంతమంది ఫిబ్రవరి 7న జరిగే అసలు జాతరలో మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు అక్కడే ఉన్నారు.

*ఫిబ్రవరి 7న సీఎం కేసీఆర్ రాక*

ఫిబ్రవరి 7 న జరగనున్న అసలు మేడారం జాతరలో వనదేవతలను దర్శించుకోవడం కోసం తెలంగాణ సీఎం కేసీర్ కూడా అదే రోజున మేడారం జాతరకు రానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here