30రోజుల్లో ఏం ఒరగబెట్టారు..?: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్!

0
96

హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు రోగులు డెంగ్యూ వ్యాధితో మృతి చెందిన విషయం విదితమే. అయితే ఈ ఇలా డెంగ్యూ వ్యాధితో మరణిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం నాడు ఈ వ్యవహారంపై కోర్టుకు.. తెలంగాణ సీఎస్‌ వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున నివారణ చర్యలు తీసుకున్నామని సీఎస్‌ ఎస్కే జోషి చెప్పారు. అయితే.. నివారణ చర్యలు తీసుకుంటే డెంగ్యూ కేసులు ఎందుకు నమోదవుతున్నాయ్? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌ మాటలు… వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయన్న హైకోర్టు కన్నెర్రజేసింది. అంతేకాదు.. డెంగ్యూ మరణాలపై తమ వద్ద ఆధారాలున్నాయని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ క్రమంలో మూసీని సందర్శించాలని ఉన్నతాధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఏం ఒరగబెట్టారు..!?
రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోనూ నదుల మధ్యే నగరాలున్నాయన్న విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. 30రోజుల ప్రణాళికలో ఏం ఒరగబెట్టారని హైకోర్టు ప్రశ్నించింది. ‘ప్రణాళికలన్నీ పేపర్లపైనే ఉన్నాయి.. వాస్తవ రూపం దాల్చలేదు. మూసీ పక్కనున్న హైకోర్టులోనే విపరీతమైన దోమలున్నాయి. జనవరిలో 85 డెంగ్యూ కేసులు నమోదైతే అక్టోబర్‌ నాటికి 3800 కేసులు పెరిగాయి. డెంగ్యూను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలి’ అని హైకోర్టు తేల్చిచెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here