‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్ సిరీస్ లో డ్రీమ్ రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. సమంత

0
112

బాలీవుడ్‌ యాక్టర్ మనోజ్‌ వాజ్‌పేయీ నటించిన వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’. సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో మధ్య తరగతికి చెందిన ఓ వ్యక్తి జాతీయ దర్యాప్తు సంస్థకు ఏజెంట్‌గా పనిచేస్తాడు. ప్రియమణి, నీరజ్‌ మాధవ్‌, పవన్‌ చోప్రా, కిషోర్‌ కుమార్‌ కీలకపాత్రలు పోషించారు. తాజాగా దీనికి సీక్వెల్‌ తెరకెక్కించనున్నారు.

ఈ గురువారం నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ ప్రారంభమయ్యింది. ఇందులో టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత నెగటివ్ రోల్ లో నటించబోతున్నారని దర్శకుడు రాజ్‌ నిడిమోరు డీకే కృష్ణ ప్రకటించారు. అంతేకాకుండా సమంత పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలిపారు.

సమంత ఇన్‌స్టాగ్రామ్ లో దీనికి సంబంధించి ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నేను నటించబోతున్న మొదటి వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2′. దీని కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఓ డ్రీమ్‌ రోల్‌ ను నాకు ఇచ్చినందుకు ప్రతిఒక్కరికీ నా ధన్యవాదాలు’ అని సమంత తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here