ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ కూడా మృతి

0
63

హైదరాబాద్‌: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతంలో తీవ్రంగా గాయపడిన ఆమె డ్రైవర్ గురునాథం కూడా మృతి చెందాడు. విజయారెడ్డిని కాపాడే క్రమంలో గురునాథం తీవ్రంగా గాయపడ్డాడు. 80 శాతం మేర గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం కంచన్‌బాగ్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురునాథం నేడు తుదిశ్వాస విడిచాడు. గురునాథం మృతితో అతని స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here