అత్యధికులు లైక్ చేసిన తెలుగు పాటగా ‘సామజవరగమన’ – Allu Arjun

0
148

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “అల…వైకుంఠపురములో…”. గతంలో విడుదలైన ‘సామజవరగమనా’ వీడియో సాంగ్ కి మంచి స్పందన లభించింది.ఇప్పుడు ఈ సాంగ్ యూ ట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ని మరియు ఎక్కువ మంది లైక్ చేసిన మొదటి తెలుగు సాంగ్ గా సంచలనం సృష్టించింది.

ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జునే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సామజవరగమన సాంగ్ యు ట్యూబ్ లో 42 మిలియన్ వ్యూస్ ని సాధించి సంచలనం సృష్టించగా, 7 లక్షల మంది లైక్ చేసిన మొదటి తెలుగు సాంగ్ గా రికార్డు సృష్టించింది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎస్ ఎస్.తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై, ఎస్. రాధాకృష్ణ అల్లు అరవింద్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జనవరి 12, సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here