నా జీవితంలో కూడా లవ్ స్టోరీ ఉంది… సాయిధరమ్ తేజ్

4
754

తెలుగు నటుడు సాయిధరమ్ తేజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ లపై స్పందించారు.

“సినిమాల్లోకి రావడానికి ముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె నా కాలేజి ఫ్రెండ్. కానీ నేను ఇంకా కెరీర్ లో సెటిల్ అవ్వని టైమ్ లోనే మా ఇద్దరికి బ్రేకప్ అయింది. ఆ అమ్మాయికి వేరే వారితో వివాహం జరిగింది.  ఇప్పుడు నేను సింగల్ గానే ఉన్నాను.

ఇక పుకార్ల విషయానికొస్తే, నేను హీరోయిన్లతో చాలా క్లోజ్ గా ఉంటాను అది నా నైజమని అంటున్నాడు. నేను సినిమాల్లోకి వచ్చిన తరువాత ఫలానా హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడంటూ ఇప్పటికీ నాపై ఈ పుకార్లు వస్తూనే వున్నాయి. నేను సినిమా చేసే ప్రతి హీరోయిన్లతో చాలా క్లోజ్ గా ఉంటాను. రాశి ఖన్నా, రెజీనా, రాకుల్ వీళ్లంతా నాకు మంచి స్నేహితులు. మేము చాలా క్లోజ్ గా ఉంటాం. అది చూసి మా మధ్య ఏదో ఉందని చాలామంది అనుకుంటున్నారు.

ఇక చూడాలి మరి నా పెళ్లితోనైనా ఈ పుకార్లకు తెరపడుతుందేమో. కెరియర్ పరంగా సెటిల్ కాగానే పెళ్లి చేసేసుకుంటాను” అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here