తిరుమల భక్తులకు షాక్… ఇకపై తిరుపతి లడ్డూ మరింత..

0
228

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయమే తీసుకుంది. ఇప్పటికే దేవస్థానం ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే రిజర్వేషన్లు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతే కాకుండా ప్లాస్టిక్ ను నిషేధించడానికి రంగం సిద్ధం చేసింది టీటీడీ. ఇక తిరుమలలో ఉండే గృహాల్లో, హోటళ్లలో వాటర్ బాటిల్స్‌ వాడకాన్ని కూడా నిషేదించింది. అంతేకాక దానికి ప్రత్యామ్నాయంగా వాటర్ ప్లాంటులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

Image result for తిరుపతి లడ్డూ

ఇక ఇప్పుడు సంచల నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఇకపై తిరుమల స్వామి వారి లడ్డూను రెట్టింపు చేసే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. తిరుపతి లడ్డూ క్రయవిక్రయాల్లో ఇప్పటివరకు ఉన్న రాయితీలన్నింటిని రద్దు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీటీడీ. ఇకపై శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు 160-180 గ్రాముల చిన్న లడ్డూ ఉచితంగా ఇచ్చి.. ఆపై ప్రతీ లడ్డూను రూ.50కి విక్రయించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

Image result for తిరుపతి లడ్డూ

అంతే కాకుండా శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులందరికీ బార్ కోడ్ విధానం ద్వారా లడ్డూలను అందించనున్నట్లు తెలిపింది టీటీడీ. తిరుమలలో లడ్డూ దళారులు ఎక్కువైపోయారని.. అందువల్ల లడ్డూ టోకెన్ల దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకే బార్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

Image result for తిరుపతి లడ్డూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here