TSRTC: కేసీఆర్‌కు అంత అహంకారమెందుకు?: సీఎంవోకు సామాన్యుడి ఫోన్

3
274

ఆర్టీసీ ఉన్నది సామాన్యుల కోసమే.. ప్రభుత్వం ఉన్నది సామాన్యుల కోసమే.. ప్రస్తుతం వీరిద్దరి పట్టుదలల మధ్య అదే సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ వైఖరిపై సామాన్యులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంవోకు ఫోన్ చేసి ఓ సామాన్యుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు.

కరీంనగర్ నుంచి రంజిత్ కుమార్ అనే వ్యక్తి సీఎం కార్యాలయం హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసిన ఓ సామాన్యుడు తన ఆవేదననంతా వెళ్లగక్కాడు. రంజిత్ కుమార్ ఆవేదన ఆయన మాటల్లోనే… ‘‘రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఏందీ అల్లకల్లోలం? ఇప్పటికే స్కూళ్లకు పదహారు రోజులు సెలవులిచ్చారు. పిల్లలు ఇప్పటికే అంతా మర్చిపోయినట్టున్నారు… ఇంకా వారం రోజులు పొడగించడమేంటి? వాళ్లేదో సమ్మెజేస్తే.. ఈయన అహంకారం కొద్ది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేంటి?

రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చా? వాళ్లు, వీళ్ల మధ్యలో మేం నలిగిపోవుడేంది? పిల్లలు నలిగిపోవుడేంది? స్కూలు బస్సులను వాడుకోవడమేంటి? ప్రజలకు ఇబ్బంది కలగొద్దు.. బస్సులను నడపండి అని చెబుతడు. మాకు ఇబ్బంది కలగడం లేదా? స్కూలు పిల్లల బస్సులు వాడుకునుడేంది? ఏదన్న ఉంటే పిలిచి మాట్లాడుకోవాలి.

ఆయనకంత అహంకరామేంటి? ముఖ్యమంత్రి అంటే తండ్రిలాంటోడు. పిల్లలు అల్లరి జేస్తే పిలిచి మాట్లాడి, పదిమందిని పిలిపించి బుద్ధి చెప్పాలే. ‘నువ్వు పోతేపో.. నేను పీకేస్తా’ అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నడు ఆయన? అది పద్ధతేనా? వాళ్ల డిమాండ్లు నువ్వు విన్నవో.. వినలేదో.. కూచోబెట్టి, ఉద్యోగ సంఘాలను పిలిచి వాళ్లముందు ఒప్పించు. అది కాకుండా 50 వేల మంది పీకి పారేస్తా అంటే వాళ్లకు కోపం రాదా? కార్మికులకు కనీసం విలువ ఇస్తల్లేడు. విలువిస్తే ఓ మెట్టు దిగుతారు.

ముఖ్యమంత్రి ప్రవర్తన చూసి మాకే చిరాకేస్తోంది. ఆర్టీసీ మాకోసమే ఉంది, సీఎం మా కోసమే ఉన్నారు? కానీ వాళ్లువాళ్లు కొట్టుకుంటే నష్టం మాకే జరుగుతోంది. ముఖ్యమంత్రిగారి అహంకార ధోరణి తగ్గాలి. సీఎం ప్రజలను లెక్కజేయడు. ఉద్యోగులను తిడతడు. కార్మికులను తిడతడు. మరి ఎవరి కోసం పాలన? ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకొన్నాం. ఉద్యమాలతో తెలంగాణ తెచ్చుకున్నం. అటువంటి ఉద్యమాలనే అణిచివేస్తారా?

ఆంధ్రా పాలకులు ఇదే విధంగా ఉద్యోమాన్ని అణచివేస్తే.. ఈయన ముఖ్యమంత్రి అయ్యేవాడా? ప్రజలను, ఉద్యోగులను కన్న బిడ్డల్లా చూసుకోవాలి. తగ్గాలే. తండ్రిలాంటోడు ప్రజల కోసం తగ్గాలి. ‘నేను విన. నేను జేయ’ అంటే నడవదు. ఇది ప్రజా స్వామ్యం కాదా. దీనిని సార్‌ దృష్టికి తీసుకువెళ్లండి’’ అంటూ రంజిత్‌ ఫోన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

3 COMMENTS

 1. Знаете ли вы?
  В 1941 году в московскую «Писательскую роту» пришли добровольцами бывший вор и следователь ЧК.
  Видеоигру с простейшей графикой называли и шедевром, и троллингом.
  Сооснователь и глава Социал-демократической партии Великобритании стал бароном.
  Крейсер «Берик» на рейде в Девонпорте
  Советские военные операторы на базе ленд-лизовского кинопулемёта и ППШ создали киноавтомат.

  [url=http://0pb8hx.com/]http://www.0pb8hx.com/[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here