TSRTC: ఆర్టీసీపై కేసీఆర్ సంచలన నిర్ణయం.. నోటిఫికేషన్ ఇచ్చేశారు!

0
54

ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉధృతమవుతోంది. దసరా పండుగ వేదికగా మొదలైన ఈ సమ్మె ఇంత ఉధృతమవుతుందని కానీ.. ప్రభుత్వం ఇంత పట్టుదలగా వ్యవహరిస్తుందని కానీ ఎవ్వరూ ఊహించలేదు. అటు ప్రభుత్వం.. ఇట్టు కార్మికులు పట్టు బిగించడమే కానీ.. విడవడమనేది మాత్రం లేదు. అసలు ఎప్పటికి ఆర్టీసీ బస్సు రోడ్డెక్కుతుందో తెలియని పరిస్థితి.

నిన్న సాక్షాత్తు రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాగే ప్రభుత్వం కూడా పాఠశాలలకు సెలవును మరో వారం పాటు పొడిగించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన కొందరు డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకున్న ప్రభుత్వం తాజాగా మరికొందరిని నియమించుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి డ్రైవర్, కండక్టర్‌తో పాటు మెకానిక్‌లు, టైర్ మెకానిక్‌లు, శ్రామికులు, ఎలక్ట్రీషియన్ల నియామకానికి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here