TSRTC: ఆర్టీసీ ఎండీపై మండిపడ్డ హైకోర్టు

0
67

ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఆ సంస్థ ఎండీ వ్యవహార శైలిపై హైకోర్టు మండిపడింది. తప్పుడు వివరాలు సమర్పించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారా? లేదంటే మంత్రిని మీరు తప్పుదారి పట్టించారా? చెప్పాలని నిలదీసింది. బాధ్యతగల ప్రజాప్రతినిధిగా మంత్రి అసెంబ్లీలో చెప్పిన వివరాలు అబద్ధాలుగా పరిగణించాలా? అంటూ ఆర్టీసీ ఎండీపై హైకోర్టు ఫైర్ అయింది.

‘‘ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉందని సాక్షాత్తూ రవాణా శాఖ మంత్రి రెండు నెలల క్రితం అసెంబ్లీలో చెప్పారు. రాయితీ బస్సు పాసులు, రుణాలు, ఇతర మొత్తాలు కలిపి ప్రభుత్వం నుంచి రూ.1492.70 కోట్లు రావాల్సి ఉందని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం అధికారులు కొత్త లెక్కలు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని పద్దుల కింద 2018-19 సంవత్సరానికి 644.51 కోట్లు మంజూరు చేసిందని, ఈ మొత్తం ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువని తేల్చేశారు. రెండింటిలో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి?’’ అని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి వచారణను హైకోర్టు 7వ తేదీకి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here