బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే.. సమ్మె విరమిస్తాం: ఆర్టీసీ జేఏసీ

0
113

తమను బేషరతుగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని.. లేదంటే కొనసాగిస్తామని జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ జేఏసీ సమావేశం నిన్న ఎంజీబీఎస్‌లో జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును గౌరవించి.. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరింది.

ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. 47 రోజుల పాటు సమ్మె ప్రశాంతంగా సాగిందని… కార్మికులు ఐక్యంగా ఉద్యమాన్ని సాగిస్తున్నారని కొనియాడారు. ఈ రోజే హైకోర్టు తీర్పు కాపీ అందిందని… దీనిపై జేఏసీ సమావేశంలో కూలంకషంగా సమీక్ష చేశామన్నారు. రెండు వారాల్లోగా లేబర్‌ కోర్టుకు కేసును రిఫర్‌ చేయాలంటూ లేబర్‌ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా సమస్యలను సత్వరమే లేబర్‌ కోర్టుకు నివేదించాలన్నారు. హైకోర్టు చెప్పిన ప్రకారం తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here