TSRTC: ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

1
269

21 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు వీరి ఆందోళన ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సామాన్య ప్రజానీకానికి రవాణా కష్టాలకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ మేరకు ఇన్‌చార్జి ఎండీ, ఈడీలకు ఆదేశాలు అందాయి. నేడు బస్‌ భవన్‌లో భేటీ కానున్నారు.

అయితే ప్రభుత్వం విలీనం మినహా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈడీల కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. అయితే విలీనం మినహా ఇతర డిమాండ్లపై చర్చించేందుకు ఆర్టీసీ కార్మికులు సుముఖత వ్యక్తం చేస్తారో లేదో వేచి చూడాలి. అయితే ఈ విషయంలో ఆర్టీసీ కార్మికులు మాత్రం దిగిరాక తప్పదని తెలుస్తోంది. మరీ మొండికేస్తే అసలుకే ఎసరొచ్చే పరిస్థితులు ఉండటంతో ఆర్టీసీ కార్మికులు దిగిరాక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతల తీరుపై కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నేటితో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here