TSRTC: ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఓయూ జేఏసీ సంచలన నిర్ణయం

13
291

ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృత రూపం దాల్చుతోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ కార్మికులకు కొండంత బలం లభించినట్టైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పట్టుదలకు తామేమీ తీసిపోమంటూ అంతే పట్టుదలతో ఆర్టీసీ కార్మికులు నిలిచారు.

ఇప్పటికే ఇది మరో తెలంగాణ పోరాటంగా అవతరిస్తుందేమోననే వ్యాఖ్యలు సర్వత్రా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు తాము అండగా ఉంటామంటూ ఓయూ విద్యార్థి జేఏసీ ప్రకటించింది. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మరింత బలం చేకూరినట్టైంది. ఓయూ విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించడమే కాకుండా తమ కార్యాచరణను కూడా వివరించింది. సోమవారం నుంచి నిరసనలకు దిగాలని నిర్ణయించింది.

ఈనెల 14న మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తామని.. అనంతరం 16న ఓయూలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఓయూ విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. అలాగే 19న విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. 21న ప్రగతి భవన్ ముట్టడిస్తామని ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సామాన్య ప్రజానీకం నుంచి కూడా మద్దతు బాగానే లభిస్తోంది. మున్ముందు ఈ సమ్మె ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

13 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here