TSRTC: ఆయన వచ్చి చెప్పేంత వరకూ శ్రీనివాసరెడ్డి మరణ వార్తను బయటకు తెలియనివ్వలేదు!

0
245

ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న మొండి వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురై ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. మరొకరు ఆత్మాహుతికి యత్నించారు.

అయితే మొదట ఖమ్మానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మాహుతతితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ఆయన శనివారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్ర గాయాల పాలైన ఆయనకు తొలుత ఖమ్మంలో వైద్య సేవలు అందించి.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయం 10:45 నిమిషాలకు చికిత్స పొందుతూ మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి, కానీ పోలీసులు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డిని పరామర్శించేందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన అసలు విషయం తెలుసుకుని బయటకు వచ్చి చెప్పేంత వరకూ కూడా శ్రీనివాసరెడ్డి మరణవార్త ఆయన కుటుంబీకులకు గానీ, ఆర్టీసీ కార్మికులకు గానీ తెలియలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here