TSRTC: మరో రెండు రోజుల్లో ముగియనున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె!

0
71

ఆర్టీసీ సమ్మె మరో రెండు రోజుల్లో కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే సమ్మె చేపట్టి 19 రోజులవుతోంది. ఒకవైపు విలీనం తప్ప ఇతర సాధ్యమైన డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమని ప్రభుత్వం చెబుతుంటే కార్మికులు మాత్రం ససేమిరా అన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి కాస్త మారినట్టు కనిపిస్తోంది. కార్మికులు చర్చలకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

బస్ భవన్‌లో బుధవారం ఈడీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పాటు డిమాండ్లపై అధికారులు చర్చించారు. రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌కు ఈడీ కమిటీ నివేదిక ఇవ్వనుంది. రేపు కానీ… ఎల్లుండి కానీ కార్మికులతో రవాణాశాఖ కమిషనర్ చర్చలు జరిపే అవకాశముంది. చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమని కార్మికులు పేర్కొంటున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here