TSRTC: RTC సమ్మెపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్టు

0
33

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చాలా తెలివి తేటలు ప్రదర్శించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉప ఎన్నికలు జరిగిన చోట్ల వందల కోట్లు ఇస్తారని… ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి రూ.47 కోట్లు ఇవ్వలేరా!? అని ప్రశ్నించింది.

‘జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన బకాయిలు ఎన్ని? సమ్మె కాలంలో ఆర్టీసీకి వచ్చిన ఆదాయం ఎంత? విభజన సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదేం? ఐదేళ్లుగా ఏం
చేస్తున్నారు? ఎవరు అడ్డుపడ్డారు?’ అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అశ్వత్థామ హతః కుంజరః అన్నట్లు ఆర్థిక శాఖ తీరు ఉందని వ్యాఖ్యానించింది.

కార్మికులను పెనం మీద నుంచి పొయ్యిలోకి తొయ్యలేమని.. సమ్మెను విరమించుకోవాల్సిందిగా ఆదేశించలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోరిన వివరాలు ఇవ్వకపోవడంపై కూడా ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎండీ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here