KarthikaDeepam అక్టోబర్ 25 ఎపిసోడ్: మీకు తెలియకుండానే మీ కన్న హృదయం స్పందించింది డాక్టర్ బాబూ..

0
170

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

ప్రిన్సిపల్ కి కేక్ ఇవ్వడానికి వెళ్తారు దీప, సౌర్య. అక్కడ మౌనిత, కార్తీక్, హిమ ఉంటారు. ప్రిన్సిపల్ ముందు మౌనిత హిమకు తల్లిలా మాట్లాడం చూస్తుంది దీప. హిమ ఎలా చదువుతుంది. మిము ఇద్దరం బిజీగా ఉండటం వాళ్ళ మా అమ్మాయి చదువు గురించి పటించుకోవడం లేదు. ఇక ఇప్పడి నుండి వారం వారం మా అమ్మాయి చదువు గురించి పట్టించుకుంటాము అని చెబుతుంది. ఇదంతా విన్న దీప ఎందుకు లెండి ప్రిన్సిపల్ గారు హిమ కూడా నా కూతురే.. అంటే నాకు సౌర్య ఎంతో హిమ కూడా అంతే. నేను ఎక్కడికి రోజు వస్తున్నాను. కార్తీక్ గారు డాక్టర్ రే ఆయన చెల్లలు లాంటి మౌనిత కూడా డాక్టర్ రే ఇద్దరికి ఎందుకు శ్రమ అంటుంది దీప. దానికి ప్రిన్సిపల్ సరే ఏదయినా ఉంటె వంటలక్కతో చెబుతానులే అంటాడు. కార్తీక్ మౌనిత చాలా కోపంగా ఉంటారు.

ఈ రోజు అక్టోబర్ 25 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

మౌనిత స్కూల్ ల్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ.. లాభం లేదు కార్తీక్. నువ్వే ఎదో ఒకటి చేయాలి. మెల్ల మెల్లగా హిమనీ తన వైపుకు లాక్కోవాలి అని చూస్తుంది ఆ దీప. నిన్ను తన వైపు లాక్కోవాలని చూసింది.. అదంతా నువ్విచ్చిన చనువే. హిమ ఎదో దాని కూతురు అయినట్టు.. ని కూతుర్ని తన కూతురిలా చూసుకున్నట్టు నటిస్తే నువ్వు దిగొస్తావని ఈ నాటకం మొదలు పెట్టిందోమో… అంటూ కార్తీక్ ని రెచ్చగొట్టడానికి చూస్తుంది మౌనిత.

ఇక కార్తీక్ మౌనితతో.. దీప కూడా నువ్వు ఆలోచిస్తున్నట్టు… నా కూతుర్ని నీ కూతురిలా చూసుకుంటున్నట్టు కలరిస్తున్నావని నిన్ను అనుకుంటుందేమో.. దీప అనుకుంటుందా.. నువ్వనుకుంటున్నావా.. అసలు ఇదంతకాదు కార్తీక్.. హిమ నీతో వంటలక్క మా ప్రిన్సిపాల్ ని నా చదువు గురించి అడిగిందని నీతో చెప్పిందా.. ఆ దీప చేయదు.. మనం చేస్తే ఊరుకోదు.. నీకు ఓపిలు నాకు డెల్వారి కేసులు ఉన్నాయి. పద వెళ్దాం అని అంటూ ఆవేశంగా అంటుంది మౌనిత కార్తీక్ తో.

సౌందర్య.. దీప, సౌర్య, కార్తీక్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ భాద పడుతుంది. ఆనందరావుతో మనం పాపం చేస్తున్నామండీ.. దీప, సౌర్య, కార్తీక్, హిమలని అందరిని విడదీసాము. ఇదంతా కదండీ.. జరిగిందంతా అందరికి చెప్పేదాం.. ఏమౌతుంది.. అంటుంది సౌందర్య. ఇంతలో హిమ ఏం చెప్పేస్తే.. ఎవరికీ చెప్పేస్తానంటున్నావ్ నానమ్మ.. చెప్పాలనుకుంటే చెప్పేయాలి.. నిను చిన్న పిల్లనైన హాస్పిటల్ కి వెళ్లి నువ్వు పెళ్లి చేసుకో డాడీ అని చెప్పేసాను.. తొందరలోనే కొత్త అమ్మని చూస్తానని కూడా చెప్పను అంటుంది హిమ. అది విని ఆనందరావు, సౌందర్య షాక్ అవుతారు.

ఆనందరావు హిమతో తొందరలోనే తొందరలోనే అంటున్నావు నువ్వు చూసావా కొత్త అమ్మని అని అడుగుతాడు. లేదు గీతకు మంచికొత్త అమ్మ దొరికినట్టే నాకు దొరుకుతుంది. ఆదిత్య హిమనీ ఇదా.. చిట్టి చిలకమ్మా అంటాడు. హిమ కావాలంటే చుడండి నిను కొత్త అమ్మని తీసుకొస్తా అని అక్కడి నుండి వెళ్లి పోతుంది. ఆనందరావుతో సౌందర్య ఇప్పుడేమంటారు అందరికి చెప్పాల్సిన టైం వచ్చిందా.. లేదా.. అని అడుగుతుంది.. లేదు నువ్వు అనుకున్న టైం వచ్చింది పిల్లలే వాళ్ళని కలుపుతారు అంటాడు ఆనందరావు.

సౌర్య, పోలీస్ ఆవిడాతో మా నాన్నను వెతికి పెట్టండి అని అడుగుతుంది. మా నాన్న నేను పుట్టినప్పడి నుంచి మాతో ఉండట్లేదు. మా నాన్న నీ నేను చూడలేదు. మా నాన్న ఎక్కడున్నాడో తెలీదు.. అని చెబుతుంది సౌర్య. దానికి పోలీస్ ఆవిడా మీ నాన్న ఫోటో ఇవ్వు అని అడిగితే.. మా అమ్మ లేదని చెప్పింది అని అంటుంది సౌర్య. పోలీస్ ఆవిడా సరే రేషన్ కార్డు మీద ఉంటుంది అది తీసుకురా.. లేకపోతే మీ అమ్మ ఫోన్ లో మీ నాన్న నెంబర్ ఉంటుంది అది తీసుకురా.. నేను ఎలాగైన మీ నాన్నని నీకు అప్పజెపుతాను అంటుంది.

 

వారణాసి, దీపతో సౌర్య ఎక్కడికో వెళ్ళిపోయింది అక్క. నేను ఎక్కడికి అని అడిగితే అమ్మకు తెలుసు పోరా అంది అని చెబుతాడు. దీప, సౌర్య ఎక్కడి వెళ్లిందో అని టెంక్షన్ పడుతూ ఉంటుంది.

సౌర్య వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అన్న ఈ ఊళ్ళోనే ఉన్నాడా.. లేక వేరే ఊళ్ళో ఉన్నాడా.. వేరే ఊళ్ళో ఉంటె అమ్మ నాన్నను తీసుకు రావడానికి వెళ్ళేది కదా.. నాన్న ఇక్కడే ఉంటె అమ్మ ఎందుకు చెప్పడం లేదు.. ఇప్పుడు నాన్నను ఎలా కనిపెట్టాలి.. నాన్న ఫోటోను వెతుకాలి. రేషన్ కార్డు లో ఉంటుంది కదా ఎలాగైన రేషన్ కార్డు తీసుకోవాలి, అని అనుకుంటుంది.

నెక్స్ట్ ఎపిసోడ్ లో..

కార్తీక్ దీప దగ్గరకు వచ్చి అసలు నీకు బుద్ది ఉందా.. పసిపిల్లల్ని ఎలా పెంచాలో తెలీదేంటే నీకు.. దాని(సౌర్య) ఎమోషన్స్ తో ఆడుకుంటావేంటే నువ్వు.. ఆ వెర్రిది నాన్న నాన్న అంటూ పిచ్చిదానిలా రోడ్డు మీద తిరుగుతుందే మెంటల్ దాన.. అని అంటాడు. దానికి దీప కానీ మీలో నాకు ఈవేళ అచ్చమైన కన్నా తండ్రి కనిపిస్తున్నాడు డాక్టర్ బాబూ. మీకు తెలియకుండానే మీ కన్నా హృదయం స్పందించింది. అంటుంది దీప.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here