బిల్ గేట్స్ ను కలిసిన ఉపాసన కొణిదెల..

0
36

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన కొణిదెల బిల్ గేట్స్ ను కలిశారు. అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మానవరాలైన ఉపాసన అపోలో ఛారిటీ వైస్ చైర్ పర్సన్ మరియు బి పాజిటివ్ మ్యాగజైన్ కు చీఫ్ ఎడిటర్. ఇటీవల ఉపాసన ఇండియన్ ఫిలాంత్రోపీ ఇనిషియేటివ్‌ (IPI)లో మాట్లాడటానికి బెంగళూరుకు వెళ్లారు. అక్కడ తనకు బిల్ గేట్స్‌ను కలిసే అవకాశం వచ్చింది.

ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో బిల్ గేట్స్ ఒకరు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. బిల్ గేట్స్ తన ఛారిటీ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి సేవలందించారు. ఈ సందర్బంగా ఉపాసన సోషల్ మీడియాలో బిల్ గేట్స్ తో ఉన్న తన ఫోటోను షేర్ చేస్తూ బిల్ గేట్స్ ని కలవడం ‘అల్టిమేట్ ఫ్యాన్ మూమెంట్’ అంటూ ఆయన్ని కలిసి మాట్లాడటం సప్రైజ్ అనిపించిందన్నారు. అంతేకాకుండా మన గ్రహాన్ని(భూమిని), ప్రజల్ని రక్షించే విషయంపై చర్చించారని ఉపాసన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here