ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక ”మహాత్మా గాంధీ” అవార్డు….

6
339

రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గతంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఉపాసన మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. 150 వ గాంధీ జయంతి సందర్బంగా ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ”మహాత్మా గాంధీ” అవార్డును గెలుచుకుంది.

అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి మానవరాలైన ఉపాసన సామజిక సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆమె అపోలో పేరిట పేద పిల్లలకు ఉచిత వైద్యం అందిస్తుంటారు. ఫిట్ నెస్, ఆరోగ్యం, ఫుడ్ హ్యాబిట్స్ గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తుంటారు. అంతేకాకుండా, స్వయంగా తానే పెళ్లైన తర్వాత 14 కేజీల బరువు తగ్గి చూపించారు.

అందులో భాగంగానే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నాయకత్వ విభాగంలో తన సేవలకు గుర్తింపుగా ”మహాత్మా గాంధీ” అవార్డును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో ‘మిమ్మల్ని మీరు కనుగొనడానికి ఉత్తమ మార్గం, ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం’ అని పోస్ట్ చేసారు. ఈ సందర్బంగా అందరికీ ధన్యవాదాలు తెలిపింది.

ఈ సందర్బంగా రామ్ చరణ్ తన సతీమణిని చూసి గర్వపడుతున్నానని ఇలా మరెన్నో అవార్డు లని గెలుచుకోవాలని తన శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ఉపాసన, ”మీ ప్రేమ, సపోర్ట్ లేకుండా నేను ఇవి సాధించేదాన్నే కాదు” అని అన్నారు. ఉపాసన ఒక కూతురిగా, భార్యగా, కోడలిగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here