‘వి’: అదరగొడుతున్న నాని కిల్లర్ లుక్..

0
199

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘వి’. హీరో నాని మొదటిసారి విలన్‌గా కనిపించనున్నాడు. అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నానిని హీరోగా పరిచయం చేసిన డైరెక్టరే.. ఇప్పుడు విలన్‌గా చూపిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలోని పాత్రల ఫస్ట్ లుక్స్ తేదీలను హీరోలే స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు.. “రాక్షసుడు” ఎదిగిన నాడు ఒకడొస్తాడని.. వాడే ఇప్పుడొస్తున్నాడు.. “రక్షకుడు” వస్తున్నాడు’ అంటూ రక్షకుడిగా నేను జనవరి 27న మీ ముందుకు వస్తున్నానని సుధీర్ బాబు ట్వీట్ చేయగా.. నాని దీనికి జవాబిస్తూ.. ‘ఓహో… అలాగా… సరే!’ రాక్షసుడు జనవరి 28న వచ్చేస్తున్నాడని పేర్కొన్నాడు.

నిన్న జనవరి 27న సుధీర్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం.. ఈరోజు జనవరి 28న హీరో నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు ఒక పవర్ఫుల్ కాప్ పాత్రలో నటిస్తున్నారు. ఇక నాని చేతిలో కత్తెర దానికి బ్లడ్ తో కిల్లర్ లుక్ లో అదరగొడుతున్నాడు.

జ‌గ‌ప‌తిబాబు, నాజర్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కాగా మార్చి 25న ఉగాది కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here