Bigg Boss Telugu 3: వరుణ్ సందేశ్ జర్నీ…మిస్టర్ కూల్, మిస్టర్ పర్ఫెక్ట్, ప్రాబ్లమ్ సాల్వర్ – బిగ్ బాస్

0
154

ఈ వారంలో బిగ్ బాస్ హౌస్ లోకి సెలెబ్రిటీలు వచ్చి హంగామా చేసారు. మొదట విజయ్ దేవరకొండ తర్వాత యాంకర్ సుమ వచ్చి సందడి చేసారు. హౌస్ లోని చివరి కంటెస్టెంట్లు రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, శ్రీముఖి, అలీ వీరికి సుమ చివరి టాస్క్ ఇవ్వగా అందులో వరుణ్ గెలుస్తాడు. తర్వాత సుమ హౌస్ లోని ప్రతి కంటెస్టెంట్ తో పర్సనల్ గా మాట్లాడుతుంది.

సుమ బిగ్ బాస్ ఇంటి సభ్యులందరితో కలిసి దీపావళి సంబరాలు జరుపుకుని, అందరూ కలిసి డాన్స్ కూడా చేస్తారు. తర్వాత సుమ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోతుంది. ఇక ఇప్పటినుండి బిగ్ బాస్ హౌస్ లోని ప్రతి కంటెస్టెంట్ జర్నీ ని పర్సనల్ గా చూపిస్తారు బిగ్ బాస్.

బిగ్ బాస్ హౌస్ లో వరుణ్ సందేశ్ జర్నీ – ప్రేక్షకులంతా వరుణ్ ని ప్రాబ్లమ్ సాల్వర్, మిస్టర్ కూల్, మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రేమగా పిలుస్తారని చెప్తారు బిగ్ బాస్. వరుణ్ తన భార్యతో రావడం వల్ల వరుణ్ కన్నా మిగతా వారికి ఈ ఇంట్లో ఉండే అర్హత ఉందని అన్నారు కానీ వరుణ్ తన భార్యను కూడా పోటీదారుగా చూశాడని ‘మీ బలం మీ మానసిక శక్తి’ అని నమ్ముతున్నానని బిగ్ బాస్ చెప్తారు. మొదట నామినేట్ అయ్యి తగ్గినా కూడా తర్వాత తేరుకుని గట్టి పోటీనిచ్చారని బిగ్ బాస్ అన్నారు. తర్వాత బిగ్ బాస్ ఇప్పటి వరకు సాగిన వరుణ్ జర్నీ ని చూపించడంతో వరుణ్ కాస్త ఎమోషనల్ అవుతాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి వరుణ్ వితికతో ఎంట్రీ నుండి తర్వాత టాస్క్ చేయడం, గొడవలు జరగడం, నామినేట్ అవడం, వాళ్ల బామ్మ రావడం, వితికతో అయిన గొడవ, మళ్లీ వారు కలవడం, తర్వాత వితిక ఎలిమినేషన్…ఇలా వరుణ్ జర్నీలోని ముఖ్యమైన సన్నివేశాలన్నింటిని చూపిస్తారు బిగ్ బాస్. దీంతో వరుణ్ కాస్త ఎమోషనల్ అయి, బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పి బయటకు వస్తాడు. బయటకు వచ్చాక వరుణ్ ఇంటి సభ్యులతో ‘నా జర్నీని చిన్న సైజ్ మూవీలా చూపించారు బిగ్ బాస్’ అని అంటాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here